News March 9, 2025
గోవాడలో ఈనెల 10న ధర్నా: ధర్మశ్రీ

చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఈనెల 10న ధర్నా నిర్వహించనున్నట్లు వైసీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకుడు ధర్మశ్రీ తెలిపారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీకి కోట్లాది రూపాయల నిధులను సమకూర్చి అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిస్థితి దమనీయంగా ఉందన్నారు.
Similar News
News March 20, 2025
మంచిర్యాల: KC వేణుగోపాల్‌ను కలిసిన ఎంపీ వంశీ

పార్లమెంట్ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్‌ను కలిసి బడ్జెట్, కుల గణన, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల అమలుపై మాట్లాడారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
News March 20, 2025
వేసవిలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త!

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు పలు సూచనలు చేశారు. 1. టైర్లలో ఎయిర్ ప్రెషర్‌ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఎందుకంటే వేడికి టైర్లు పేలిపోయే అవకాశం ఉంది. 2. ఇంజిన్ కూలెంట్ స్థాయిని చెక్ చేయండి. అవసరమైతే రీఫిల్ చేయండి. 3. బ్యాటరీ స్థితిని తనిఖీ చేయండి. 4. ఏసీ వ్యవస్థ పనిచేస్తుందో లేదో చూడండి.
* పగటిపూట ప్రయాణాలు మానుకోండి: పోలీసులు
News March 20, 2025
ట్రోఫీలు అందుకున్న జిల్లా నేతలు

విజయవాడలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రెండు రోజుల పాటు క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో మంత్రి TG భరత్ విన్నర్‌గా నిలిచారు. ఎమ్మిగనూరు MLA నాగేశ్వరరెడ్డి రన్నన్‌గా నిలిచారు. ఇక డబుల్స్‌లో మంత్రి సత్యకుమార్‌తో కలిసి నాగేశ్వరరెడ్డి విన్నర్‌గా నిలిచారు. సింగిల్స్ ఉమెన్స్ పోటీల్లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రన్నర్‌గా నిలిచారు. సీఎం, డిప్యూటీ సీఎం నుంచి వారు ట్రోఫీలు అందుకున్నారు.