News January 2, 2025
గోవాలో ప.గో.జిల్లా యువకుడి మృతి
గోవాలో తాడేపల్లిగూడేనికి చెందిన రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. అందిన సమాచారం మేరకు.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కాలంగూట్ బీచ్ కు వెళ్లారు. ఓ రెస్టారెంట్లో రవితేజ అతని మిత్రుడు సందీప్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే వారి వద్ద నుంచి అధిక ధర డిమాండ్ చేయడంతో కుదరదని చెప్పారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం రవితేజపై దాడికి పాల్పడింది. దెబ్బలు తాళలేక రవితేజ మృతి చెందినట్లు సమాచారం.
Similar News
News January 8, 2025
ఆచంట రైతుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం
ఆచంటకు చెందిన ఉత్తమ రైతు, అనేక అవార్డులు పొందిన నెక్కంటి సుబ్బారావును రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ రావాలని మంగళవారం ఆహ్వానం అందింది. ఈ నెల 26న ఢిల్లీలో జరుగునున్న రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి ఆహ్వాన పత్రిక అందుకున్నట్లు నెక్కంటి సుబ్బారావు తెలిపారు. ఈయన హైబ్రిడ్ కొత్త వరి వంగడాలను తీసుకొచ్చి రైతులు అధిక దిగుబడులు సాధించేలా కృషి చేస్తారు.
News January 8, 2025
నరసాపురం: అమ్మాయి ఆత్మహత్య కేసులో యువకుడి అరెస్టు
నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని ప్రగతి నగర్‌కు చెందిన సాయి లక్ష్మి కుమారి(19) ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ తెలిసిన వివరాలు ప్రకారం.. ఈ కేసులో గీతా చరణ్‌ను మంగళవారం యర్రంశెట్టివారిపాలెం పంచాయతీ పీతాని మెరకలో అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నరసాపురం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు SI సురేష్ తెలిపారు.
News January 8, 2025
కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలి: ప.గో కలెక్టర్
జల, వాయు, భూ కాలుష్య నియంత్రణ మార్గాలను ఆలోచించి అమలు చేయడంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం భీమవరంలో కలెక్టర్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వివిధ మార్గాల ద్వారా పోగవుతున్న చెత్తను నియంత్రించేలా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్, ఇరిగేషన్, డ్వామా, ఫిషరీస్, డిఆర్ డి ఏ, టూరిజం శాఖల అధికారులు పాల్గొన్నారు.