News January 2, 2025

గోవాలో ప.గో.జిల్లా యువకుడి మృతి

image

గోవాలో తాడేపల్లిగూడేనికి చెందిన రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. అందిన సమాచారం మేరకు.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కాలంగూట్ బీచ్‌ కు వెళ్లారు. ఓ రెస్టారెంట్లో రవితేజ అతని మిత్రుడు సందీప్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే వారి వద్ద నుంచి అధిక ధర డిమాండ్ చేయడంతో కుదరదని చెప్పారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం రవితేజపై దాడికి పాల్పడింది. దెబ్బలు తాళలేక రవితేజ మృతి చెందినట్లు సమాచారం. 

Similar News

News January 21, 2025

ఆ నిధులను సమాజ సేవకే వినియోగిస్తాం: ప.గో కలెక్టర్

image

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు ద్వారా సేకరించిన నిధులను సమాజ సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రకటించారు. రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదుపై కలెక్టర్ సోమవారం సమీక్షించారు. రూ.లక్ష కంటే ఎక్కువగా సభ్యత్వ రుసుము సేకరించిన తణుకు తహశీల్దార్, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ అభినందించారు.

News January 20, 2025

బిహార్‌కు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ RRR

image

ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిహార్ వెళ్లారు. ఆ రాష్ట్రంలో జరిగిన అఖిల భారత సభాపతుల మహాసభలో పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇతర రాష్ట్రాల స్పీకర్లతో కలిసి ఆయన సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్ల విధులు గురించి తెలుసుకున్నారు.

News January 20, 2025

భారత జట్టుకు ఏలూరు ఎంపీ శుభాకాంక్షలు

image

ఖోఖో ప్ర‌పంచ‌క‌ప్‌ పోటీల్లో విజేతగా నిలిచిన భార‌త జట్టుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ పోటీల్లోనే భారత మహిళలు, పురుషుల జట్లు విశ్వవిజేతలుగా నిలవడం సంతోషంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు.