News June 22, 2024
గోవిందరావుపేట: వామ్మో దెయ్యం..!
గోవిందరావుపేట మండలం చల్వాయి వట్టెవాగులో దెయ్యం సంచరిస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐదారు నెలల నుంచి వట్టెవాగులో దెయ్యం తిరుగుతుందంటూ ప్రచారం సాగుతోంది. అయితే దెయ్యం ఫొటో అని చెబుతూ ఓ చిత్రాన్ని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికంగా ప్రభుత్వ అధికారులు ఇలాంటి ప్రచారంపై అవగాహన కల్పించి ప్రజల్లోని అభద్రతాభావాన్ని పోగొట్టాలని కోరుతున్నారు.
Similar News
News November 5, 2024
WGL: పంపకాల్లో హెడ్ కానిస్టేబుళ్ల మధ్య గొడవ.. బదిలీ వేటు
ఓ ఫిర్యాదుదారుడి వద్ద తీసుకున్న డబ్బు విషయంలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల మధ్య ఘర్షణ తలెత్తిన ఘటన వెలుగులోకి రావడంతో వారిపై బదిలీ వేటు పడింది. WGL జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న మోహన్ నాయక్, సోమ్లా నాయక్ ఒక కేసులో ఓ వ్యక్తి నుంచి తీసుకున్న డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. దీనిపై సీఐ చంద్రమోహన్ విచారణ చేపట్టారు. వారిద్దరిని వేర్వేరు స్టేషన్లకు బదిలీ చేశారు.
News November 5, 2024
వరంగల్ నుంచి పుష్ పుల్ రైలు
పుష్‌పుల్ (07463) రైలును రెండేళ్ల తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్ వరకు పొడిగించారు. గతంలో ఈ రైలు వరంగల్- సికింద్రాబాద్ మధ్య మధ్యాహ్న సమయంలో నడిచేది. అయితే మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా 2 సం.ల నుంచి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. దీంతో వరంగల్ నుంచి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు.. తాజాగా పుష్‌పుల్ రైలును వరంగల్‌కు పొడిగించారు.
News November 5, 2024
భీమదేవరపల్లి: బస్టాండులో భార్య కళ్లెదుటే భర్త మృతి
HNK జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామానికి చెందిన కూన పోచయ్య (45) ముల్కనూరు బస్టాండులో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. 3 రోజుల క్రితం పోచయ్య భార్య రేణుక పండగకు తల్లిగారింటికి వెళ్లగా.. మద్యం తాగుతూ అప్పటి నుంచి బస్టాండులోనే ఉంటున్నాడు. సోమవారం అతడి భార్య ఇంటికి తీసుకువెళ్లేందుకు బస్టాండ్ వద్దకు వచ్చింది. నీళ్లు తాగించి నిమ్మరసం కోసం పక్కకు రాగానే కిందకు ఒరిగి మృతి చెందాడు.