News April 6, 2025
గోవింద పల్లెలో ఫ్యాక్షన్ పడగ!

సిరివెళ్ల మండలంలోని గోవింద పల్లె ఫ్యాక్షన్ హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రస్తుతం దాడికి గురైన ప్రతాపరెడ్డి సోదరుడు ఇందూరి ప్రభాకర్ రెడ్డి గతంలో సిరివెళ్ల మాజీ ఎంపీపీగా పనిచేశారు. ప్రభాకర్ రెడ్డి అతనితో పాటు ఉన్న శ్రీనివాస్ రెడ్డిని 2017వ సంవత్సరంలో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ప్రభాకర్ రెడ్డి, ప్రతాపరెడ్డిల తండ్రి నారాయణరెడ్డి కూడా 1987వ సంవత్సరంలో దారుణ హత్యకు గురయ్యారు.
Similar News
News December 6, 2025
విశాఖ: రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాట్లకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖలో 12 రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శనివారం తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఖాళీ అవుతున్న 25 డ్వాక్రా మహిళలు, ఆరు PHC స్టాల్స్‌కు డిసెంబర్ 7 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులను గోపాలపట్నం మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో అందజేయాలి.
News December 6, 2025
కర్నూలు కలెక్టర్ నేతృత్వంలో పంటపై సమీక్ష.!

కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి వివిధ పంటల మార్కెటింగ్‌పై ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయమైన ధర లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, వ్యవసాయ అధికారులతోపాటు అనుబంధ శాఖల అధికారులు ఉన్నారు.
News December 6, 2025
విశాఖలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంఖుస్థాపన

విశాఖ తూర్పు నియోజకవర్గం ముడసర్లోవలో రూ.62 కోట్లతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు ఎంపీ శ్రీభరత్, విప్ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి శంఖుస్థాపన చేశారు. రాష్ట్రానికి మంజూరైన 5 హాస్టళ్లలో 3 విశాఖకే దక్కడం విశేషం. సీఎం చంద్రబాబు కృషి, కేంద్ర నిధుల సద్వినియోగంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని విప్ చిరంజీవిరావు తెలిపారు. ఈ ఐదంతస్తుల భవనం ఉద్యోగినులకు సురక్షిత వసతిని అందిస్తుందన్నారు.


