News April 11, 2025
గోవుల మరణంపై లోతైన విచారణ జరపాలి: MP

మూడు నెలల్లో టీటీడీ గోశాలలో సుమారు 100 ఆవులు మృతి చెందాయని MP గురుమూర్తి ఆరోపించారు. హిందువులు గోవులను తల్లిగా భావిస్తారు. అలాంటి గోవులు ఇలా దయనీయ స్థితిలో ఉండడం తీవ్ర మనో వేదనకు గురి చేస్తోందన్నారు. తక్షణమే గోవుల మృతిపై లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గోశాలలో ఇంతటి నిర్లక్ష్యం పనికిరాదని MP స్పష్టం చేశారు.
Similar News
News November 24, 2025
WGL: ఇప్పటి వరకు 556 మాత్రమే!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,442 దివ్యాంగ SHG ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో ఇప్పటి వరకు 556 మాత్రమే ఏర్పాటయ్యాయి. హనుమకొండలో 345లో 210, వరంగల్ 272లో 56, జనగామ 283లో 68, మహబూబాబాద్ 332లో 145, ములుగు 112లో 52, భూపాలపల్లి 98లో 25 సంఘాలు ఏర్పాటయ్యాయి. మరిన్ని సంఘాల ఏర్పాటుకు క్షేత్రస్థాయి సిబ్బంది దివ్యాంగులను అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నారు.
News November 24, 2025
HYD సిటీ కంటే ‘సింగారం’ బెస్ట్

పట్నంలో ఇరుకు రహదారులు, ట్రాఫిక్తో ప్రజలు విసిగిపోతున్నారు. విశాల ప్రాంతమైన సిటీ శివారు ప్రతాపసింగారానికి షిఫ్ట్ అవుతున్నారు. పట్నానికి 10 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఇక్కడ ఇళ్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ఫోసిస్-ORR సమీపం కావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ప్రయాణ సౌలభ్యం పెరిగింది. ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ పూలింగ్ స్కీం కింద 130 ఎకరాలను సేకరించి అభివృద్ధి చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది.
News November 24, 2025
Next నెల్లూరు మేయర్ ఎవరు..? జరుగుతున్న చర్చ ఇదే

మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నెగ్గితే తర్వాత మేయర్ ఎవరనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. స్రవంతి ST సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలన్న అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. అదే జరిగితే 53వ డివిజన్ కార్పొరేటర్ సుజాత, 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రకు అవకాశం ఉంటుంది. లేదంటే డిప్యూటీ మేయర్కి ఇన్ఛార్జ్ మేయర్ బాధ్యతలు ఇచ్చే చాన్స్ కూడా ఉంది.


