News December 17, 2024

‘గోవు మృతి… ఊరు మొత్తం కంటతడి’

image

మూగ జీవి మృతితో ఊరు మొత్తం కంటతడిపెట్టిన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లిలోని చోటుచేసుకుంది. గ్రామంలోని శంభులింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ సమయంలో భక్తులు ఆలయానికి గోవును బహూకరించారు. నిత్యం గ్రామస్థులు దానిని సొంత గోమాతగా భావించి ఇంటిలో ఉన్న పదార్థాలను అందిస్తూండేవారు. 4 రోజుల క్రితం హైవేపై బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. దీంతో ఊరు మొత్తం కంటతడిపెట్టి.. ఘనంగా అంత్యక్రియలు చేశారు.

Similar News

News November 25, 2025

నల్గొండ జిల్లాలో నేటి సమాచారం

image

NLG: మహిళా ఓట్ల కోసం వ్యూహం
NLG: కోమటిరెడ్డికి భట్టి విక్రమార్క ఆహ్వానం
NLG: ఏర్పాట్లు వేగవంతం.. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
NLG: ఉత్కంఠకు తెర.. రిజర్వేషన్లు ఖరారు
NLG: సర్కార్ దవాఖానలో వసూళ్ల పర్వం కలకలం
నకిరేకల్: జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు
నార్కట్ పల్లి: ఎంజీయూ రిఫ్రిజిరేటర్‌లో కప్ప.. ఏబీవీపీ ధర్నా
NLG: టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఇదీ పరిస్థితి

News November 24, 2025

ప్రజా సమస్యల పరిష్కారం దిశగా గ్రీవెన్స్ డే: ఎస్పీ

image

ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే విధంగా కృషి చేయడమే లక్ష్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 33 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వినతులను స్వీకరించారు. సంబంధిత ఫిర్యాదులపై వేగంగా స్పందించి పోలీస్ సేవలు అందజేయాలని ఎస్పీ సూచించారు.