News March 31, 2025
గోస్పాడు యువకుడికి ఉగాది పురస్కారం

గోస్పాడుకు చెందిన ఆవుల మల్లికార్జున అనే క్రీడాకారుడు జాతీయస్థాయి సీనియర్ పురుషుల బాల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ లో రజత పథకం సాధించాడు. ఈ సందర్భంగా ఆయనికి ఉగాది సంబరాల్లో భాగంగా క్రీడా ప్రోత్సాహకాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అందించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని, క్రీడల వల్ల మానసిక ధైర్యం కలుగుతుందన్నారు.
Similar News
News January 7, 2026
కోరుట్ల: వెంకటేశ్వర స్వామికి 108 రకాల నైవేద్యాలు

కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారికి 108 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు సమర్పించారు. ఆలయ అర్చకులు అభిషేకం తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News January 7, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుపై 27న తుది వాదనలు
✓ 9న అశ్వారావుపేటలో రైతు మేళా: కలెక్టర్
✓ చండ్రుగొండలో కుష్టు వ్యాధిపై అవగాహన
✓ జూలూరుపాడు: నాటు సారా కేసులో నలుగురు బైండోవర్
✓ వేసవి పంటలతో అధిక లాభాలు: జూలూరుపాడు ఏఈఓ
✓ ఈ బయ్యారంలో ఘనంగా క్రీడా పోటీలు ప్రారంభం
✓ బూర్గంపాడు: సారపాకలో కోతుల స్వైర విహారం
✓ టేకులపల్లిలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం
News January 7, 2026
పారదర్శకంగా ఓటర్ జాబితా సవరణ: సూర్యాపేట కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీసీలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఓటర్ జాబితాపై అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో వార్డుల మ్యాపింగ్ తప్పిదాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా సరిచేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ నెల 12న వార్డుల వారీగా జాబితా విడుదల చేస్తామన్నారు.


