News January 3, 2025
గౌరీపట్నం: భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి
దేవరపల్లి మండలం గౌరిపట్నం తాలూకా కొండగూడెం 15వ వీధిలో రాపాక నాగార్జున(38) భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. కాగా భార్య మీద అనుమానం, పలుమార్లు ఫోన్ వాడొద్దని చెప్పిన మాట వినకపోవడంతో తీవ్ర అసహనానికి గురై భార్యపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు స్పందించి ఆమెను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవరపల్లి పోలీసులు సీఐ, ఎస్సైలు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.
Similar News
News January 8, 2025
ప.గో. జిల్లాలో నేడు మోదీ ప్రారంభించేవి ఇవే..!
ప.గో. జిల్లాలోని వివిధ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ నుంచి నేడు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. జీలుగుమిల్లి- బుట్టాయిగూడెం, ఎల్ఎన్డీ పేట- పట్టిసీమ రహదారి విస్తరణ (రూ.369 కోట్లు), గుడివాడ- భీమవరం- నరసాపురం రైల్వే లైన్, భీమవరం- నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు (రూ.4612 కోట్లు) ప్రారంభిస్తారు.
News January 8, 2025
ఆచంట రైతుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం
ఆచంటకు చెందిన ఉత్తమ రైతు, అనేక అవార్డులు పొందిన నెక్కంటి సుబ్బారావును రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ రావాలని మంగళవారం ఆహ్వానం అందింది. ఈ నెల 26న ఢిల్లీలో జరుగునున్న రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి ఆహ్వాన పత్రిక అందుకున్నట్లు నెక్కంటి సుబ్బారావు తెలిపారు. ఈయన హైబ్రిడ్ కొత్త వరి వంగడాలను తీసుకొచ్చి రైతులు అధిక దిగుబడులు సాధించేలా కృషి చేస్తారు.
News January 8, 2025
నరసాపురం: అమ్మాయి ఆత్మహత్య కేసులో యువకుడి అరెస్టు
నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని ప్రగతి నగర్కు చెందిన సాయి లక్ష్మి కుమారి(19) ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ తెలిసిన వివరాలు ప్రకారం.. ఈ కేసులో గీతా చరణ్ను మంగళవారం యర్రంశెట్టివారిపాలెం పంచాయతీ పీతాని మెరకలో అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నరసాపురం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు SI సురేష్ తెలిపారు.