News October 12, 2024
గ్యాంగ్ రేప్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి: సీపీఐ
చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లిలో బళ్లారి నుంచి ఉపాధి కోసం వచ్చిన కుటుంబంలోని వాచ్‌మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకుని శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ్ డిమాండ్ చేశారు. పొట్టకూటి కోసం వచ్చిన అత్త, కోడలిపై గ్యాంప్ రేప్‌నకు పాల్పడిన ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమన్నారు.
Similar News
News November 13, 2024
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ వినోద్
గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు వైద్య సేవలు ఎక్కువ సంఖ్యలో అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. వి, ఐఏఎస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రభుత్వ వైద్య కళాశాల 2024 వ బ్యాచ్ వైద్య విద్యార్థులుకు అవిన్య పేరుతో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరై ప్రసంగించారు.
News November 13, 2024
జపాన్ బృందంతో JNTU ఇన్‌ఛార్జ్ వీసీ సమావేశం
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శనరావు మంగళవారం జపాన్ బృందంతో సమావేశమయ్యారు. అనంతరం పలు ఇంజినీరింగ్ విద్య ప్రణాళికల గురించి వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులకు భవిష్యత్తులో అవసరమయ్యే టెక్నికల్ పరిజ్ఞానాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వీసీతో పలువురు విద్యావంతులు పాల్గొన్నారు.
News November 13, 2024
అసెంబ్లీ విప్‌గా రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాసులు
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు కీలక పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విప్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గత టీడీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా కూడా సేవలందించారు. విప్‌గా ఎంపికైనందుకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.