News October 13, 2024
గ్యాంగ్ రేప్ బాధాకరం: పయ్యావుల

బళ్లారి నుంచి ఉపాధి కోసం వచ్చి చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లిలో అత్తా కోడలిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. పొట్టకూటి కోసం వచ్చిన అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమని చెప్పారు.
Similar News
News December 24, 2025
అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించాలి: కలెక్టర్ ఆనంద్

వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, రైతుల సమస్యల పరిష్కారానికి అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతుల ద్వారా సాగు ఖర్చులు తగ్గించి, రైతులకు లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు.
News December 24, 2025
అనంతపురం పార్లమెంట్ టీడీపీ కమిటీ నియామకం

అనంతపురం పార్లమెంట్ టీడీపీ నూతన కమిటీని బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. జిల్లా అధ్యక్షుడిగా పులా నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా లాలప్ప, రంగయ్య, మల్లికార్జున, వెంకటేశులు, ఆదినారాయణ, ప్రసాద్, కృష్ణ కుమార్, బర్డెవాలి, మర్రిస్వామి ఎంపికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
News December 24, 2025
సీఎం చంద్రబాబును కలిసిన పూల నాగరాజు

అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన పూల నాగరాజు మంగళవారం సెక్రటేరియట్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని నాగరాజు పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.


