News March 10, 2026

గ్యాస్ కొరత‌.. మొబైల్, ఇంటర్నెట్‌పై ఎఫెక్ట్?

image

LPG కొరతతో మొబైల్, ఇంటర్నెట్ సేవలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. టెలికాం టవర్ తయారీ సంస్థలకు గ్యాస్ సప్లై నిలిచిపోవడమే ఇందుకు కారణం. టెలికం టవర్లు తుప్పుపట్టకుండా తయారీ సమయంలో జింక్‌తో వేసే రక్షణ పొరకు LPG/LNG అవసరం. ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్‌కు తగిన LPG లేకపోతే ఆపరేషన్స్ నిలిపివేయాల్సి వస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీంతో నెట్‌వర్క్ విస్తరణ నెమ్మదించి కనెక్టివిటీపై ప్రభావం పడుతుందని తెలిపారు.

Similar News

News April 13, 2026

రామ్ చరణ్ అదిరిపోయే లుక్!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ తన ఏప్రిల్ కవర్ పేజీపై చరణ్‌ ఫొటోను ప్రచురించింది. డార్క్ బ్లూ కోటులో లాంగ్ హెయిర్‌తో చేతిలో కుక్కపిల్లను పట్టుకుని ఉన్న ఆయన స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుడిగా ఈ మ్యాగజైన్ ఆయన్ను అభివర్ణించింది. హాంకాంగ్‌లోని విక్టోరియా హార్బర్‌లో జరిగిన ఈ ఫొటోషూట్ లుక్ SMలో వైరల్ అవుతోంది.

News April 13, 2026

డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం అవసరం: సీఎం రేవంత్

image

TG: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై PM మోదీకి CM రేవంత్ ట్వీట్ చేశారు. ఈ రెండూ వేర్వేరు అంశాలన్నారు. ‘రాష్ట్రాల వారీగా అసెంబ్లీ సీట్లకు మహిళల కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తాం. జనాభా ఆధారిత డీలిమిటేషన్ జరగకుండా మహిళా రిజర్వేషన్ కోటాను వాడుకోవడం సరికాదు. ఇది BJPకి తాత్కాలికంగా లాభం చేకూర్చినా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్‌పై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం అవసరం’ అని పేర్కొన్నారు.

News April 13, 2026

అసమగ్ర డేటాతో డీలిమిటేషన్ వద్దు: సోనియా

image

లోక్‌సభ, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో మహిళకు 33 శాతం సీట్లు కేటాయించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. 2027 జనగణనకు ముందే అసమగ్ర డేటా ఆధారంగా డీలిమిటేషన్‌‌ను చేయడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగంపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు. ‘నారీ శక్తి వందన అధినియమ్’ సవరణ బిల్లును ఏప్రిల్ 16-18 మధ్య కాకుండా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాలని డిమాండ్ చేశారు.