News February 24, 2025
గ్యాస్ పంపిణీపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు: జేసీ

దీపం పథకం కింద సరఫరా చేస్తే గ్యాస్ సిలిండర్లపై అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి హెచ్చరించారు. కలెక్టరేట్లో సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ డీలర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఐవీఆర్ఎస్ విధానంలో ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే విచారణ నిర్వహిస్తామన్నారు.
Similar News
News February 23, 2026
నెల్లూరు: పరిశ్రమకు భూమి కేటాయింపు

ఉదయగిరి మండలం చెర్లోపల్లి–వడ్డీపాలెం గ్రామాల సమీపంలో బయోగ్యాస్(CBG) ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే నం.251లో సుమారు 200 ఎకరాల భూమిని ప్లాంట్ కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు. జనావాసాల దగ్గర ప్లాంట్ ఏర్పాటుతో దుర్వాసన, కాలుష్యం, ప్రమాదాల భయం పెరుగుతుందని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News February 23, 2026
సికింద్రాబాద్‌లో నకిలీ బేరింగుల దందా.. మాల్ సీజ్..!

సికింద్రాబాద్ రాణిగంజ్‌లో నకిలీ బేరింగుల దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. SKF బ్రాండ్ పేరుతో కల్తీ మాల్ అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో మహంకాళి పోలీసులు మెరుపుదాడులు చేశారు. SV టూల్, బేరింగ్ ఇంటర్నేషనల్ వంటి షాపుల్లో ఏకంగా 1987 నకిలీ బేరింగులు, వేల సంఖ్యలో ప్యాకింగ్ బాక్సులను సీజ్ చేశారు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను జైలుకు పంపారు.
News February 23, 2026
విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ 10 నుంచి ఎగ్జామ్స్

TG: ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్-2 వార్షిక పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే నెల 20న ఎగ్జామ్స్ ముగుస్తాయి. సమాధాన పత్రాలను ఏ రోజుకారోజు మూల్యాంకనం చేసి విద్యార్థుల మార్కులను ISMS పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఓవరాల్‌గా 23న ఫలితాలు విడుదల చేస్తారు. అదే రోజు బడుల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.


