News February 27, 2026
గ్రహణం కారణంగా వేములవాడ ఆలయాలు మూసివేత

పాక్షిక చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3వ తేదీన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాలతో పాటు అన్ని అనుబంధ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆ రోజు తెల్లవారుజామున ప్రాతఃకాల పూజలు ముగిసిన వెంటనే ద్వారబంధనం చేయనున్నారు. తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించి, యథావిధిగా పూజలు నిర్వహిస్తామని వెల్లడించారు.
Similar News
News April 14, 2026
ADB: ఇండస్ట్రియల్ పార్క్ చుట్టూ బినామీల దందా..!

జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ భూములపై రాజకీయ ప్రముఖుల కన్ను పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భీంపూర్, బోరజ్ ప్రాంతాల్లో ఓ ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు వందల ఎకరాలు ముందే కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం తక్కువ ధరకు కొని, భూసేకరణ ద్వారా అధిక ధరకు ప్రభుత్వానికే విక్రయించేలా ‘క్విడ్ ప్రో కో’ జరుగుతోందని మాజీ మంత్రి జోగు రామన్న అనుమానం వ్యక్తం చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
News April 14, 2026
మెదక్: హైవేపై మరమ్మత్తులను పరిశీలించిన కలెక్టర్

మెదక్ కలెక్టరేట్ ముందు జరుగుతున్న నేషనల్ హైవే 765-డీజీ రోడ్డు మరమ్మత్ పనులను కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సురక్షిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News April 14, 2026
‘త్రిశంకు స్వర్గం’ గురించి తెలుసా?

అటూ ఇటూ కాకుండా నిలిచిపోయిన పరిస్థితిని ఈ జాతీయంతో పోలుస్తాం. ఇక్ష్వాకు వంశ రాజు త్రిశంకుడికి మానవ శరీరంతోనే స్వర్గంలోకి వెళ్లాలని కోరిక. దానికోసం యజ్ఞం నిర్వహించాలని వశిష్ఠుడిని కోరగా తిరస్కరిస్తారు. విశ్వామిత్రుడు తన తపోశక్తితో ఆయనను స్వర్గ ద్వారం వద్దకు చేరుస్తారు. ఇంద్రుడు అడ్డుకోవడంతో త్రిశంకుడు భూమిపై పడిపోతుండగా విశ్వామిత్రుడు మరో స్వర్గాన్ని సృష్టిస్తారు. అదే త్రిశంకు స్వర్గం. <<-se>>#EPICSAYINGS<<>>


