News December 30, 2024
గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు ఖమ్మం జిల్లా
గ్రానైట్ పరిశ్రమకు ఖమ్మం జిల్లా పెట్టింది పేరని, దీని అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఆదివారం ఖమ్మంలోని పీవీఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ జిల్లా నుంచే ఢిల్లీలో ఉన్న పోలీస్ జాతీయ స్మారక మ్యూజియానికి, ఇండియా గేట్ వద్ద నెలకొల్పిన సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి గ్రానైట్ను అందజేయడం జరిగిందన్నారు.
Similar News
News January 6, 2025
నిజరూపంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య
భద్రాద్రి క్షేత్రంలో కొలువైన జగదభిరాముడి సోమవారం నిజరూప రామావతారంలో దర్శనమిచ్చారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ముందుగా దేవస్థాన వేద పండితులు స్వామివారిని బేడా మండపానికి తీసుకొచ్చి రామావతారంలో అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం వేద మంత్రోచ్చరణలు,మేళతాళాలు, భక్తుల కోలాటాలు,రామ నామ స్మరణల నడుమ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు.
News January 6, 2025
ఇంటర్ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య
ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. కొత్తగూడానికి చెందిన పవన్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల లెక్చరర్/ యాజమాన్యం వేధింపులు తట్టుకొలేక సూసైడ్ చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
News January 6, 2025
ALERT.. KMM: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్!
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా కొత్తగూడెంలో ఓ వ్యక్తికి మాంజా తగిలి గొంతుకు గాయమైన విషయం తెలిసిందే.