News August 26, 2024
గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ఆశావాహుల ఎదురుచూపు
గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో సర్పంచుల పదవీకాలం ముగియగా, నాటి నుంచి గ్రామ సచివాలయాల పరిపాలన ప్రత్యేక అధికారుల చేతిలోకి వెళ్ళింది. లోకసభ ఎన్నికలు పూర్తికాగానే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుందని అందరూ ఊహించారు. అయితే బిసి జనాభా బీసీ గణన పూర్తయిన తర్వాతే ఎన్నికల నిర్వహిస్తారని సంకేతాలు రావడంతో ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
Similar News
News September 18, 2024
కొత్తగూడెం: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారి
కొత్తగూడెం కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.1 లక్షా 14 వేలు లంచం తీసుకుంటున్న హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై కోసం లంచం తీసుకుండగా ఏసీబీ దాడులు నిర్వహించింది. సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ వెల్లడించారు.
News September 18, 2024
19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోందని సీడబ్ల్యుసీ అధికారులు ప్రకటించారు. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో గోదావరి వద్ద నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం భద్రాచలం గోదావరిలో పటిష్ఠ బందోబస్తు నడుమ వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.
News September 18, 2024
MSME పాలసీ పటిష్ఠం చేయాలని నిర్ణయం: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలో MSME పాలసీ పటిష్ఠం చేయాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణలో MSME పాలసీ తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ MSME పాలసీ లేదన్నారు. ఆర్థిక వ్యవస్థకు చిన్న, సూక్ష్మ పరిశ్రమలు కీలకమని చెప్పారు. భారీ పరిశ్రమలతో పాటు MSMEలకు తమ సర్కారు అనుకూల వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు.