News July 17, 2024
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న బహుళవిధ కార్మికుల నిరీక్షణకు తెరపడింది. కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. కార్మికుల ఖాతాల్లో సత్వరం జమచేయాలని అధికారులను ఆదేశించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ల్లోని 1,070 గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న 2,346 మంది మల్టీపర్పస్ కార్మికులకు రూ.8.98 కోట్లు అందనున్నాయి.
Similar News
News October 18, 2025
ఖమ్మం: బందోబస్త్‌ను పరిశీలించిన పోలీస్ కమిషనర్

బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ జేఏసీ శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీంచారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
News October 18, 2025
రోగులపై సేవా భావాన్ని కలిగి ఉండాలి: ఖమ్మం కలెక్టర్

వైద్య వృత్తి పవిత్రమైందని, రోగుల పట్ల సేవా భావాన్ని వైద్యులు కలిగి ఉండాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం కలెక్టర్, ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన 2025-వైట్ కోట్ సెర్మనిలో పాల్గొన్నారు. వైద్య వృత్తి ఎన్నుకున్న విద్యార్థులు అకాడమిక్స్‌లో పట్టు సాధించడంతో పాటు మానవ శ్రేయస్సు కోసం ప్రయత్నించాలని, మన దగ్గర వచ్చే రోగులకు పేద, ధనిక భేదం లేకుండా వారికి చికిత్స అందించాలన్నారు.
News October 18, 2025
ఖమ్మం జిల్లా డీసీసీ పీఠమెక్కేదెవరో..?

ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఈ పదవి కోసం ఇప్పటికే 30 మంది దరఖాస్తు చేసుకోగా ఎవరిని ఎంపిక చేస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ముగ్గురు మంత్రుల అనుచరులు ఎవరికి వారు తమకు అధ్యక్ష పదవి దక్కేలా చూడాలంటూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమాత్యులు, ఇతర ముఖ్య నేతల ఏకాభిప్రాయంతో డీసీసీని ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది.