News January 23, 2025
గ్రామసభలు అట్టర్ ప్లాప్: నాగజ్యోతి

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్రామసబలు అట్టర్ ప్లాప్ అయ్యాయని ములుగు మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ నాగజ్యోతి అన్నారు. నియోజకవర్గంలో ప్రతి చోట ప్రజలు తిరగబడి, అధికారులను ప్రశ్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తుల పేరుతో ప్రజలను దగా చేయాలని చూస్తుందన్నారు. బుట్టాయిగూడెం గ్రామసభలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కుమ్మరి నాగేశ్వరరావు ఘటనకు మంత్రి సీతక్క బాధ్యత వహించాలన్నారు.
Similar News
News February 6, 2025
రేపు ఒంగోలులో ఆర్జీవీ విచారణ

AP: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను రేపు ఒంగోలు రూరల్ పీఎస్‌లో పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని రెండుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా వర్మ హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 4న మరోసారి సమన్లు ఇవ్వగా ఈనెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది.
News February 6, 2025
BREAKING: భారత్ విజయం

ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.
News February 6, 2025
భువనగిరి లాడ్జీల్లో పోలీసుల తనిఖీ

భువనగిరిలోని పలు లాడ్జీలను తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివేరా, డాల్ఫిన్, ఎస్వీ, ఎస్ఆర్ లాడ్జీలను చెక్ చేశామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటున్నారా అని లాడ్జి యాజమాన్యాన్ని ఆరా తీసినట్లు చెప్పారు. MLC ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లైతే తమకు సమాచారం అందించాలన్నారు. సీఐ సురేశ్ కుమార్, ఎస్సైలు లక్ష్మీనారాయణ, కుమారస్వామి పాల్గొన్నారు.