News January 25, 2025
గ్రామసభలో చదివిన పేర్లు దరఖాస్తుదారులవే: ASF అడిషనల్ కలెక్టర్

గ్రామ సభలో చదివిన పేర్లు దరఖాస్తుదారుల మాత్రమే అర్హుల జాబితా కాదని అడిషనల్ కలెక్టర్ డేవిడ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కైర్గావ్ గ్రామంలో ఎంపీడీవో శంకరమ్మ అధ్యక్షతన ప్రజాపాలన గ్రామసభను నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మాట్లాడుతూ.. ఇది దరఖాస్తుదారుల జాబితా మాత్రమే అని అర్హులది కాదన్నారు. జాబితాలో పేరు లేని వారు గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించారు.
Similar News
News November 27, 2025
తీవ్ర అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడుతుందని APSDMA వెల్లడించింది. ఇది ఈ నెల 29 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు మోస్తరు వర్షాలు, ఎల్లుండి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వానలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంట గంటకు 50-70KM వేగంతో గాలులు వీస్తాయంది.
News November 27, 2025
VKB: దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని క్రీడా పోటీలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 28న వికారాబాద్లోని బ్లాక్ గ్రౌండ్లో దివ్యాంగుల కోసం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వికలాంగుల సంక్షేమ అధికారి కృష్ణవేణి తెలిపారు. ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. క్యారమ్, జావెలిన్, రన్నింగ్, షార్ట్పుట్ వంటి క్రీడలు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలకు 81794 32874 లేదా 90007 78300 సంప్రదించాలన్నారు.
News November 27, 2025
నేడే మెగా వేలం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) మెగా ఆక్షన్ నేడు ఢిల్లీలో జరగనుంది. 277 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. మహిళల వరల్డ్ కప్లో రాణించిన దీప్తీ శర్మ, రేణుక, వోల్వార్ట్ తదితరులు భారీ ధర దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇవాళ వేలంలోకి వచ్చే క్రికెటర్లలో దియా యాదవ్(16), భారతి సింగ్(16) తక్కువ వయస్సుగల వారు కాగా, SA ప్లేయర్ షబ్నిమ్(37)ఓల్డెస్ట్ క్రికెటర్.


