News January 25, 2025
గ్రామసభలో చదివిన పేర్లు దరఖాస్తుదారులవే: ASF అడిషనల్ కలెక్టర్

గ్రామ సభలో చదివిన పేర్లు దరఖాస్తుదారుల మాత్రమే అర్హుల జాబితా కాదని అడిషనల్ కలెక్టర్ డేవిడ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కైర్గావ్ గ్రామంలో ఎంపీడీవో శంకరమ్మ అధ్యక్షతన ప్రజాపాలన గ్రామసభను నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మాట్లాడుతూ.. ఇది దరఖాస్తుదారుల జాబితా మాత్రమే అని అర్హులది కాదన్నారు. జాబితాలో పేరు లేని వారు గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించారు.
Similar News
News July 11, 2025
బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్‌కు ‘పట్టు’ దొరికేనా?

TG: ఎన్నికల హామీ మేరకు BC రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఇటీవల BJPకి BCల మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రిజర్వేషన్లు అమలైతే రెడ్డి, SC వర్గాల్లో బలంగా ఉన్న INCవైపు BCలూ మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో రాబోయే స్థానిక ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి బలం పెరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మీరేమంటారు?
News July 11, 2025
JMKT: భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలుకు అదనపు ఏసీ బోగీ

సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్(12733 – 34) రైలుకు ఒక అదనపు ఏసీ బోగీ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 13 నుంచి ఈ అదనపు బోగీ అందుబాటులోకి వస్తుందన్నారు. అదనపు ఏసీ బోగీ ఏర్పాటుతో సెలవుల్లో వివిధ దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్‌తో పాటు, సౌకర్యంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
News July 11, 2025
శాఖాంబరీగా.. భద్రాకాళి దర్శనం

వరంగల్ ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శాకంబరీగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు అమ్మవారిని ఉదయాన్నే ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.