News January 24, 2025

గ్రామసభల్లో పోలీసుల బందోబస్తు: జిల్లా ఎస్పీ

image

చివ్వెంల మండల పరిధిలోని మున్యానాయక్ తండాలో గ్రామసభలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం పరిశీలించారు. గ్రామసభ నిర్వహణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభ కార్యక్రమాలలో భాగస్వామ్యమై పోలీసు బందోబస్తు కల్పిస్తున్నా మన్నారు. గ్రామ సభలో పాల్గొన్న ప్రజలతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవి, సీఐ రాజశేఖర్ ఉన్నారు.

Similar News

News February 15, 2025

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

News February 15, 2025

ఫిబ్రవరి 15: చరిత్రలో ఈరోజు

image

1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జననం
1739: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జననం
1964: సినీ దర్శకుడు, నిర్మాత అశుతోశ్ గోవారికర్ జననం
1982: సినీ నటి మీరా జాస్మిన్ జననం

News February 15, 2025

మంచిర్యాల: ‘అలా పెళ్లి చేసుకుంటే రూ.10 లక్షలు ఇవ్వాలి’ 

image

కులాంతర వివాహితుల రక్షణకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి డూర్కే మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలోని కులాంతర వివాహాల జంటలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

error: Content is protected !!