News November 30, 2024

గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని కలెక్టర్ రంజిత్ బాషా ఎంపీడీవోలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎమ్ఎస్ఎమ్ఈ సర్వే శుక్రవారం నుంచి ప్రారంభం అయిందన్నారు. ప్రభుత్వం ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తోందని, సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. సాగు నీటి సంఘాల ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలన్నారు.

Similar News

News December 7, 2024

కుమార్తె పెళ్లి రండి.. ప్రధానికి మంత్రి భరత్ ఆహ్వానం

image

మంత్రి టీజీ భరత్ ప్రధాని మోదీని కలిశారు. ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా గతంలో ఒక కమిటీకి ఛైర్మన్‌గా నాన్న టీజీ వెంకటేశ్ చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకోవడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి తెలిపారు. అనంతరం తన కుమార్తె శ్రీ ఆర్యపాన్య వివాహానికి రావాలని పెళ్లి పత్రిక అందజేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. కాగా ఈ నెల 26న హైదరాబాద్‌లో వారి పెళ్లి జరగనుంది.

News December 7, 2024

శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించిన హీరో నాగార్జున

image

శ్రీశైలం డ్యామ్‌ను ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున శుక్రవారం సందర్శించారు. మల్లన్న దర్శనార్థమై వచ్చిన ఆయన శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యలో డ్యామ్ వద్ద కాసేపు ఆగారు. జలాశయం అందాలను తిలకించారు. డ్యామ్ వద్ద ఉపాధి పొందే పలువురు ఫోటోగ్రాఫర్లు నాగార్జునతో ఫొటోలు దిగారు. అంతకుముందు నూతన వధూవరులు అక్కినేని నాగచైతన్య, శోభితతో కలిసి నాగార్జున శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు.

News December 7, 2024

నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత

image

శ్రీశైల క్షేత్రంలో వెలసిన మల్లికార్జున స్వామి స్పర్శదర్శనాన్ని శని, ఆది, సోమవారాల్లో తాత్కాలికంగా నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ఈ 3 రోజుల్లో ఉచిత స్పర్శదర్శన సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. తిరిగి మంగళవారం నుంచి శుక్రవారం వరకు యథావిధిగా స్పర్శ దర్శనం సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.