News September 6, 2024

గ్రామీణ రహదారుల పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు: Dy. సీఎం పవన్

image

వరదల కారణంగా దెబ్బతిన్న గ్రామీణ రహదారుల పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు Dy. సీఎం పవన్ తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రామీణ రహదారులు, పారిశుద్ధ్య కార్యకలాపాల పర్యవేక్షణకై పనిచేసే ఈ బృందాలకు అధికారులుగా కృష్ణా, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల ఇన్‌ఛార్జిగా వీఆర్‌ కృష్ణతేజను, గుంటూరు, ఏలూరు జిల్లాలకు ఇన్‌ఛార్జిగా షణ్ముఖ్‌‌ను పవన్ నియమించారు.

Similar News

News December 5, 2025

ఈ నెల 8న కృష్ణా వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు

image

కృష్ణా విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్ధుల కోసం ఈ నెల 8వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఎల్. సుశీల ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షకు హాజరు కానీ వారు, అర్హత సాధించని వారు కూడా అర్హులేనని తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తమ సర్టిఫికెట్లతో ఈ నెల 8వ తేదీన అభ్యర్ధులు స్వయంగా రిపోర్ట్ చేయాలన్నారు.

News December 5, 2025

సాకారం దిశగా మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్

image

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌కు లైన్ క్లియర్ అవుతోంది. MP వల్లభనేని బాలశౌరి కృషి ఫలిస్తోంది. మచిలీపట్నం-రేపల్లెకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 45 KM మేర రైల్వే లైన్ ఏర్పాటుకు DPR తయారీకి ఫీల్డ్ సర్వే పనులు జరుగుతున్నాయని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

News December 5, 2025

పైడమ్మ జాతర రెండో రోజు.. సిద్ధమవుతున్న శిడిబండ్లు.!

image

పెడనలో పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు శుక్రవారం శిడిబండ్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జాతర రెండో రోజు కాపుల వీధి నుంచి విశేషంగా మొత్తం 11 శిడిబండ్లు అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధికి బయలుదేరనున్నాయి.