News March 25, 2025
గ్రామ పంచాయతీలు లేని జిల్లాగా మన మేడ్చల్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇక గ్రామాలు లేని జిల్లాగా మారనుంది. గతంలో 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు ఉండేవి. అవన్నీ గ్రామాలు మేడ్చల్ నియోజకవర్గంలోనే అన్ని గ్రామాలు ఉండేవి. కొన్ని నెలల క్రితం 28 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన గ్రామాలతో 3 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో గ్రామాలు లేకుండా పోయాయి. మున్సిపాలిటీల సంఖ్య 12కు చేరింది.
Similar News
News November 8, 2025
GDK: MLA ప్రమేయంతోనే గుడులను కూల్చివేశారు

రామగుండం MLA- MS రాజ్ ఠాకూర్ ప్రమేయంతోనే గ్రామ దేవతల ఆలయాలను కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారని నియోజకవర్గ BJP ఇన్చార్జి కందుల సంధ్యారాణి ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కూల్చివేతకు బాధ్యులైన అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కూల్చివేసిన గుడుల స్థానంలోనే తిరిగి పునర్ నిర్మించాలన్నారు.
News November 8, 2025
ఈ నెల 12న జిల్లాలో వైసీపీ నిరసన ర్యాలీలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడుతున్నామని వైసీపీ పార్లమెంట్ అబ్జర్వర్ మురళీ కృష్ణంరాజు, భీమవరం ఇన్‌ఛార్జి వెంకట్రాయుడు తెలిపారు. శనివారం రాయలంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నెల రోజులుగా సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతోందని, దానిలో భాగంగా 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
News November 8, 2025
తుళ్లూరు: APCRDA ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ

APCRDA ఆధ్వర్యంలో VIT- AP యూనివర్సిటీలో రాజధాని ప్రాంత మహిళలకు హౌస్ కీపింగ్‌లో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. శనివారం నుంచి 15 రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుందని అధికారులు తెలిపారు. మొత్తం 76 మంది మహిళలు శిక్షణకు హాజరుకాగా పలువురు అధికారులు పాల్గొన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలకు ఉచిత రవాణా సదుపాయం ఉంటుందని, రాజధాని ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.


