News January 23, 2025
గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ హనుమంతు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామసభలో ప్రవేశపెట్టిన జాబితాలో పేర్లు రానివారు.. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. గ్రామసభల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరాలని అన్నారు.
Similar News
News December 13, 2025
వంగలో కొమ్మ, కాయకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

శీతాకాలంలో వంగ పంటను కొమ్మ, కాయకుళ్లు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్క నుంచి కాయ కోత వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గుండ్రని బూడిద, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల కాండం, కాయలు కుళ్లి రాలిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన మొక్క నుంచే విత్తనం సేకరించాలి. కాస్త వేడిగా ఉన్న నీటిలో విత్తనం నానబెట్టి విత్తుకోవాలి. తొలిదశలో లీటరు నీటికి మాంకోజెబ్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News December 13, 2025
కొత్తపేట: తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

కొత్తపేట మండలం మద్దుల మెరకలో విషాదం చోటుచేసుకుంది. తాటి చెట్టుపై నుంచి పడి చుట్టుగుళ్ల ఏడుకొండలు (45) అనే గీత కార్మికుడు మృతి చెందాడు. శనివారం కల్లు గీసేందుకు చెట్టు ఎక్కిన ఆయన ప్రమాదవశాత్తు పట్టుతప్పి కింద పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
News December 13, 2025
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి: కలెక్టర్

గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా శనివారం భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా నేటి నుంచి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని అన్నారు.


