News December 31, 2024

గ్రీటింగ్ కార్డ్స్ ❤

image

న్యూ ఇయర్ అంటే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ సందడి. అంగట్లో ఛార్ట్ కొని శుభాకాంక్షలు చెబుతూ ఫ్రెండ్స్‌కు పంచేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అని ఫీలైన వారు ఎంతమందో. ఇంట్లో మారాం చేసయినా తమకు ఇష్టమైన నటీనటుల కార్డులు కొనేవారు. రాను రాను ఆ కార్డులు కనుమరుగైపోయాయి. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..

Similar News

News January 7, 2025

కర్నూలు జిల్లాలో నిందితుడి పరార్?

image

పోలీసుల అదుపులో నుంచి నిందితుడు పరారైన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఆదోని పట్టణ పరిధిలో జరిగిన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టుకు తీసుకెళ్తుండగా పోలీసులకు మస్కా కొట్టి పరారైనట్లు సమాచారం. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే సంబంధిత స్టేషన్ సిబ్బంది నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

News January 7, 2025

నంద్యాల జిల్లాలో 13,92,036 మంది ఓటర్లు

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టి తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని డీఆర్ఓ రామునాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటర్ల సవరణ అనంతరం జిల్లాలో 13,92,036 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో పురుష ఓటర్లు 6,81,581మంది, మహిళా ఓటర్లు 7,10,193 మంది, ఇతరులు 262 మంది ఉన్నారన్నారు. అన్ని నియోజకవర్గాల పోలింగ్ స్టేషన్లలో ఈఆర్వోలు తుది ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తున్నారన్నారు.

News January 6, 2025