News December 31, 2024
గ్రీటింగ్ కార్డ్స్ ❤
న్యూ ఇయర్ అంటే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ సందడి. అంగట్లో ఛార్ట్ కొని శుభాకాంక్షలు చెబుతూ ఫ్రెండ్స్‌కు పంచేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అని ఫీలైన వారు ఎంతమందో. ఇంట్లో మారాం చేసయినా తమకు ఇష్టమైన నటీనటుల కార్డులు కొనేవారు. రాను రాను ఆ కార్డులు కనుమరుగైపోయాయి. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..
Similar News
News January 16, 2025
BREAKING: కాటసాని అనుచరులపై మంత్రి బీసీ అనుచరుల దాడి
బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాటసాని రామిరెడ్డి అనుచరుడు మొహమ్మద్ ఫైజ్ కుటుంబంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారంటూ పోలీస్ స్టేషన్‌లో రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫైజ్ కుమారుడి వివాహంలో కెమెరామెన్లు డ్రోన్లతో షూట్ చేస్తుండగా మంత్రి కాంపౌండ్‌లోకి డ్రోన్ వెళ్లిందంటూ కెమెరామెన్లను కొట్టారని, అదే సమయంలో ఫైజ్ కుటుంబంపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News January 15, 2025
కర్నూలు: కవలల ఇంట సంక్రాంతి కాంతులు
ఒకేసారి కవలలు అంటే కాస్త ఆశ్చర్యం, కానీ రెండోసారి కవల పిల్లలంటే అద్భుతమే అని చెప్పాలి. కర్నూలు జిల్లా నందవరం గ్రామానికి చెందిన ఫక్కీరప్ప, కృపావతి దంపతులు మొదట ఇద్దరు ఆడపిల్లలు, రెండోసారి ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. అమ్మాయిల పేర్లు స్నేహ, శ్వేత కాగా అబ్బాయిల పేర్లు అఖిల్, నిఖిల్‌గా నామకరణం చేశారు. కవల పిల్లలతో సంక్రాంతిని సంతోషంగా జరుపుకున్నామని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
News January 15, 2025
పండగ రోజు విషాదం.. వెల్దుర్తిలో చిన్నారి మృతి
కర్నూలు బెంగళూరు 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయ. గిరి (10) అనే బాలుడు దుర్మరణం చెందాడు. వెల్దుర్తి ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు, కళ్యాణిల కుమారుడు గిరి రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యప్తు చేపట్టారు.