News January 12, 2025

గ్రీన్‌కో ఎనర్జీ ప్రాజెక్ట్ దేశానికే తలమానికం: మంత్రి టీజీ భరత్

image

ఓర్వకల్లు మండలం పిన్నాపురం దగ్గర నిర్మించిన గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు దేశానికే తలమానికమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ప్రాజెక్టును 2014లో తమ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకున్న ముందు చూపుతో రాష్ట్రానికి తీసుకువచ్చారని తెలిపారు.

Similar News

News November 24, 2025

అర్జీలు స్వీకరించిన కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ. సిరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.

News November 24, 2025

సైబర్ మోసాలపై అప్రమత్తం కావాలి: కర్నూలు ఎస్పీ

image

ATM డిపాజిట్ మెషిన్లు (CDM), PhonePe/UPIను ఉపయోగించి మోసగాళ్లు అక్రమ లావాదేవీలు జరిపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ‘తెలియని వ్యక్తుల కోసం ATM CDMలో డబ్బు జమ చేయండి, PhonePe/UPI ద్వారా పంపండి, కమిషన్ ఇస్తాం’ అంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లు చెప్పారు. ఇవి మనీ లాండరింగ్ & సైబర్ నేరాల కిందికి వస్తాయన్నారు. వాటిలో పాల్గొనేవారు కూడా నేరస్థులే అన్నారు.