News March 30, 2025
గ్రీన్ఫీల్డ్తోనే కొత్తగూడెం ఎయిర్పోర్టు ఆలస్యం: తుమ్మల

ఆగస్టు 15 నాటికి ఖమ్మం-రాజమండ్రి రోడ్డు అందుబాటులోకి రాబోతుందని, గ్రీన్ఫీల్డ్ కావడంతో కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ ఆలస్యమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మంలో మంత్రి మాట్లాడుతూ.. పేదలకు లబ్ధి చేకూరేలా ఉగాది నుంచి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. అటు భద్రాద్రి రామాలయ అభివృద్ధికి CM మొదటి దశ కింద భూసేకరణకు రూ.34 కోట్లు మంజూరు చేసిందనుకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News September 19, 2025
మైథాలజీ క్విజ్ – 10

1. శ్రీరాముడి పాదధూళితో శాపవిముక్తురాలైంది ఎవరు?
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని ఎవరు చంపారు?
3. కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు?
4. మధుర మీనాక్షి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. చిరంజీవులు ఎంత మంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#mythologyquiz<<>>
News September 19, 2025
అన్నమయ్య: టాప్ గ్రేడ్ బొప్పాయి ధర@ రూ.8

అన్నమయ్య జిల్లాలో బొప్పాయి ఎగుమతికి ధరలను నిర్ణయించినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం తెలిపారు. టాప్ గ్రేడ్ బొప్పాయి ధర కిలో రూ.8గా, సెకండ్ గ్రేడ్ ధర కిలో రూ.7గా నిర్ణయించామన్నారు. తక్కువ ధరకు బొప్పాయిని కొనుగోలు చేసే ట్రేడర్లపై రైతులు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 9573990331, 9030315951ను అందుబాటులో ఉంచారు.
News September 19, 2025
బాపట్ల: 18-30 ఏళ్లు ఉన్న వారికే ఈ ఛాన్స్

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బాపట్లలో శనివారం జాబ్ మేళాను స్థానిక సాల్వేషన్ ఆర్మీ ఐటీఐ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి మాధవి తెలిపారు. అరబిందో ల్యాబ్స్, ముత్తూట్ ఫైనాన్స్, రిలయన్స్ ట్రెండ్, వరుణ్ మోటార్స్ తదితర కంపెనీలు హాజరుకానున్నాయన్నారు. 18-30 ఏళ్లు కలిగి పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమో, ఏంబీఏ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.