News January 12, 2025

గ్రీన్‌ కో సభ్యులతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ

image

కర్నూలు జిల్లా పిన్నాపురం పర్యటనలో భాగంగా శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రీన్‌ కో ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఉద్యోగులు, కార్మికులతో సెల్ఫీ దిగారు. ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా పవన్ కళ్యాణ్ స్వయంగా కారు డ్రైవ్ చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ చీఫ్ ఆయనకు గ్రీన్ కో కంపెనీ గురించి వివరించారు.

Similar News

News February 23, 2026

కర్నూలు జిల్లాలో రైతులకు పుష్కలంగా యూరియా నిల్వలు

image

కర్నూలు జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. 2025-26 రబీ సీజన్ కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక సిద్ధం చేశారు. యూరియాను అధిక ధరలకు అమ్మినా, ఇతర ప్రాంతాలకు తరలించినా డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల కొరతపై ఫిర్యాదుల కోసం 8341302863 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.

News February 23, 2026

కర్నూలు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నిర్వహించారు. ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశించిన గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని, ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News February 23, 2026

ఆ లింకులు నమ్మకండి.. ఎస్పీ హెచ్చరిక!

image

ఎనిమిదో వేతన సంఘం నేపథ్యంలో “8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్” పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్ ద్వారా పంపిస్తున్న ఏపీకే(APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని, ఇటువంటి మోసాల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.