News January 31, 2025

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఏర్పాటుకు రైతులు సహకరించాలి: WGL కలెక్టర్

image

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై రైతుల ఎలాంటి అపోహలు చెందవద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాట్ల సేకరణకై పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ, సంగెం మండలం చింతలపల్లి మండలాలకు చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారదా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 19, 2025

రాష్ట్రంలో రానున్న 2, 3 రోజుల్లో చిరుజల్లులు

image

TG: గాలిలో అనిశ్చితి కారణంగా రాబోయే 2, 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. సాధారణం కన్నా ఒకటి, రెండు డిగ్రీలు మాత్రమే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఉక్కపోత ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

News February 19, 2025

వల్లభనేని వంశీ కేసులో అప్డేట్

image

మాజీ ఎమ్మెల్యే వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో నేడు విచారణ జరిగింది. జైలులో వంశీకి అందిస్తున్న వివరాలను సమర్పించాలని జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. జైలర్ వివరాల ప్రకారం తీర్పు ప్రకటిస్తామని న్యాయమూర్తి గురువారానికి కేసు వాయిదా వేశారు

News February 19, 2025

GWL: పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చాలి: కలెక్టర్

image

పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా మున్సిపల్ సిబ్బంది పని చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 37 వార్డుల్లో రెవెన్యూ, పారిశుద్ధ్యం, మెప్మా, అకౌంట్స్, ఇంజనీరింగ్ వంటి విభాగాల వారిగా సమీక్ష నిర్వహించి, ప్రతి అంశంపై సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచేందుకు ఆస్తి, దుకాణాల పన్నులు వసూలు చేయాలన్నారు.

error: Content is protected !!