News December 17, 2024
గ్రీవెన్స్‌డేతో సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు: SP

గ్రీవెన్స్‌డేతో బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఈరోజు నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది ఆర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు.
Similar News
News December 6, 2025
మర్రిగూడ: పట్టుబడుతున్నా మారట్లేదు

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న చర్చ నడుస్తోంది. గతంలో పనిచేసిన తహశీల్దార్లు మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్, సర్వేయర్ రవి నాయక్ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడడం మండలంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని సక్రమంగా విధులు నిర్వహించి మర్రిగూడకు మంచి పేరు తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.
News December 6, 2025
NLG: 3,035 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

నల్గొండ జిల్లా వ్యాప్తంగా 7,494 పోలింగ్ స్టేషన్లో ఉంటే.. 3,035 సమస్యాత్మక పోలింగ్ స్టేషనులను పోలీసులు గుర్తించారు. ఈ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో ఐదు నుంచి 6 మంది సిబ్బందితో భద్రత కల్పించనున్నారు. గ్రామాల్లో గొడవలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ప్రతి మండలంలో నలుగురు ఎస్ఐలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News December 6, 2025
NLG: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం: కలెక్టర్

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకారవేతనం (స్కాలర్‌షిప్) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వచ్చే శుక్రవారంలోగా స్కాలర్‌షిప్ దరఖాస్తులు 30% దాటేలా ఎంఈఓలు కృషి చేయాలన్నారు. కుల ధ్రువపత్రాలు తహశీల్దార్లు జాప్యం చేయకుండా ఇవ్వాలని, బ్యాంకులు సహకరించాలని సూచించారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


