News April 8, 2024
గ్రీవెన్స్ డే రద్దు: SP చందనా దీప్తి

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు ముగిసేవారు వరకు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరగదని తెలిపారు.
Similar News
News December 21, 2025
ఎలక్షన్ ఎఫెక్ట్.. మంద కొడిగానే బియ్యం పంపిణీ..!

జిల్లాలో రేషన్ బియ్యం విక్రయాలు డిసెంబర్ మాసంలో మందకొడిగా సాగాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ప్రభావం ప్రజా పంపిణీ కేంద్రాలపై పడింది. పల్లె పోరులో చాలా బిజీగా ఉన్న లబ్ధిదారులు రేషన్ దుకాణాల వంక చూడకపోవడంతో ఆయా దుకాణాలలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. 23 మండలాల్లో బియ్యం పంపిణీ 35 శాతానికి మించలేదు. దీంతో మరో రెండు మూడు రోజులపాటు సరఫరా చేయనున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు.
News December 21, 2025
NLG: బిల్లులు వచ్చేనా.. ఇక్కట్లు తొలిగేనా?!

రెండేళ్ల నుంచి గ్రామపంచాయతీలలో బిల్లులు పెండింగ్లో ఉండడంతో గ్రామ కార్యదర్శులు అనేక అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్ల నుంచి గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో పైఅధికారుల సూచన మేరకు తామే వివిధ అభివృద్ధి పనుల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల్లో పనులు చేయించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నామని తెలిపారు. రెండేళ్ల నుంచి బిల్లులు పెండింగ్లోనే ఉండడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
News December 21, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

NLG: 23న కేటీఆర్ రాక.. ఏర్పాట్ల పరిశీలన
NLG: ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
మిర్యాలగూడలో నకిలీ వైద్యుల గుట్టురట్టు
నల్గొండలో ప్రమాదకరంగా మ్యాన్ హోల్
చిట్యాల: ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి?
నల్గొండ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
కట్టంగూరు హస్తంలో లుకలుకలు
నిడమనూరు: ఆ 5 గ్రామాల పల్లె పగ్గాలు యువత చేతికి
నల్గొండ: త్వరలో సహకార ఎన్నికలు


