News September 25, 2024
గ్రూపు తగాదాలను పార్టీలకు ఆపాదిస్తారా?: మాజీ ఎమ్మెల్యే అనంత

‘గ్రామాలలోని గ్రూపు తగాదాలను పార్టీలకు ఆపాదిస్తారా’ అని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. రాముల వారి రథం దగ్ధం ఘటన బాధాకరమని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనను వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, అధికార పార్టీకి జిల్లా ఎస్పీ ఊడిగం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
Similar News
News November 16, 2025
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డాక్టర్ కార్తీక్ రెడ్డి

బెలుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్న కార్తీక్ రెడ్డి (39) పంపనూరు పుణ్యక్షేత్రంలో దైవ దర్శనానికి వచ్చి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పంపనూరు క్షేత్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవ దర్శనానికి వచ్చి సమీపంలోని కాలువలో స్నానానికి దిగగా నీటి ప్రవాహం ఎక్కువై కొట్టుకుపోయినట్లు వివరించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 16, 2025
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 16, 2025
భర్త హత్యాయత్నం ఘటనలో భార్య మృతి

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో అనుమానంతో ఎర్రిస్వామి తన భార్య రత్నమ్మను కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకుంది. రత్నమ్మను కుటుంబసభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.


