News March 12, 2025

గ్రూప్-01లో సత్తా చాటిన హుజూర్‌నగర్ తహశీల్దార్

image

హుజూర్‌నగర్ తహశీల్దార్‌గా పనిచేస్తున్న మందాడి నాగార్జునరెడ్డి గ్రూప్ -01 ఫలితాల్లో 900 మార్కులు గాను 488 మార్కులు సాధించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్ ) మండలం బోయగూడెంకు చెందిన నాగార్జునరెడ్డి 2011లో గ్రూప్-02కు ఎన్నికై డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆతర్వాత తహశీల్దార్‌గా ప్రమోషన్ పొందారు. ఇప్పుడు గ్రూప్-1 ఫలితాలలో మంచి మార్కులు సాధించడం పట్ల పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.

Similar News

News December 4, 2025

హార్టికల్చర్ హబ్‌కి కేంద్రం ₹40వేల కోట్లు: CBN

image

AP: హార్టికల్చర్ హబ్‌గా 9 జిల్లాలను తయారుచేస్తున్నామని CM CBN తెలిపారు. దీనికోసం కేంద్రం పూర్వోదయ స్కీమ్ కింద ₹40వేల కోట్లు ఇస్తోందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడుల్ని ఆకర్షించాలని చెప్పారు. అధికారులు టెక్నాలజీపై గ్రిప్ పెంచుకోవాలన్నారు. 7వ తరగతి నుంచే AI బేసిక్స్‌పై బోధన ఉండాలని సూచించారు. విశాఖ కాపులుప్పాడలో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల కోసం 50 ఎకరాలు కేటాయించాలని చెప్పారు.

News December 4, 2025

కంట్రోల్ రూమ్‌లను వినియోగించుకోవాలి: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్&మానిటరింగ్ కమిటీ, సహాయ కేంద్రంను (కంట్రోల్ రూమ్) ఇప్పటికే ప్రారంభించామని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఏమైనా సమస్యలు ఉంటే, ఎన్నికలకు సంబంధించిన సమాచారం కొరకు టోల్ ఫ్రీ నంబర్ 96662 34383 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News December 4, 2025

బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: పీడీ

image

నెల్లూరును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని ICDS పీడీ హేనా సుజన్ అన్నారు. గురువారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రాంగణంలో బాల్య వివాహ రహిత భారత్ కోసం 100 రోజుల అవగాహన కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు, CDPOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.