News March 12, 2025
గ్రూప్-01లో సత్తా చాటిన హుజూర్‌నగర్ తహశీల్దార్

హుజూర్‌నగర్ తహశీల్దార్‌గా పనిచేస్తున్న మందాడి నాగార్జునరెడ్డి గ్రూప్ -01 ఫలితాల్లో 900 మార్కులు గాను 488 మార్కులు సాధించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్ ) మండలం బోయగూడెంకు చెందిన నాగార్జునరెడ్డి 2011లో గ్రూప్-02కు ఎన్నికై డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆతర్వాత తహశీల్దార్‌గా ప్రమోషన్ పొందారు. ఇప్పుడు గ్రూప్-1 ఫలితాలలో మంచి మార్కులు సాధించడం పట్ల పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
Similar News
News February 7, 2026
శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్ టెస్ట్.!

5th నుంచి 9th వరకు చదువుతున్న విద్యార్థులకు శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఈ పరీక్ష ఆదివారం ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి ఆల్ బ్యాంక్ కాలనీలోని శ్రీ షిర్డీసాయి విద్యానికేతన్ స్కూల్‌లో జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరు సద్వినియోగం చేసుకోవాలని విద్యాసంస్థల ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ సూచించారు.
News February 7, 2026
భారత వృద్ధి రేటును పెంచిన గోల్డ్‌మన్ శాక్స్

2026 సంవత్సరానికి సంబంధించి భారత రియల్ GDP వృద్ధి రేటు అంచనాను గోల్డ్‌మన్ శాక్స్ 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.9%కి సవరించింది. భారత వస్తువులపై టారిఫ్‌లను 25% నుంచి 18%కి తగ్గిస్తూ US నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. దీనివల్ల ఎగుమతులు పెరగడమే కాకుండా, ప్రైవేట్ పెట్టుబడులూ పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. దీంతో రూపాయిపై ఒత్తిడి తగ్గి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని వెల్లడించింది.
News February 7, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం

కోవూరులో ఇటీవల అపహరణకు గురైన బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అంగడికి వెళ్తున్న బాలికను ఇద్దరు మైనర్లు బైకుపై ఎక్కించుకుని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ద్రవం తాగించడంతో బాలిక కోమాలోకి వెళ్లిపోంది. అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాలికను తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయింది. మైనర్లను జువెలైన్ హోంకు తరలించారు.


