News March 31, 2025

గ్రూప్-1లో అదరగొట్టిన పాలమూరు బిడ్డలు

image

ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల ర్యాంకులను టీజీపీఎస్‌సీ తాజాగా ప్రకటించింది. ఇందులో మల్టీజోనల్ ర్యాంకులలో పాలమూరు బిడ్డలు అదరగొట్టారు. కొత్తకోటకు చెందిన పవన్‌కుమార్‌కు 10వ ర్యాంకు, మూసాపేట నిజాలపూర్‌కు చెందిన వెంకటేశ్ ప్రసాద్‌కు 12వ ర్యాంకు, కల్వకుర్తి పట్టణానికి చెందిన సాహితీకి 45వ ర్యాంకు, పాన్గల్ మం. బుసిరెడ్డిపల్లికి చెందిన సుజాతకి 900 మార్కులకు గానూ.. 459 మార్కులు వచ్చాయి.

Similar News

News December 5, 2025

సిరిసిల్ల: మానేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం

image

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మానేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం శుక్రవారం లభ్యమయింది. అటుగా వెళుతున్న వాహనదారులు మృతదేహాన్ని చూసి ఫొటోలు, వీడియోలు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. మృతదేహానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 5, 2025

నా ఓరుగల్లు.. కాకతీయులు ఏలిన నేల!

image

కాకతీయులు ఏలిన ఓరుగల్లు గడ్డపై పుట్టిన బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా తమ నేలను మర్చిపోరు. ఈ నేలపై ఓరుగల్లు ప్రజలు చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు. ఎక్కడ కలుసుకున్నా జిల్లా బంధం ఇట్టే కలిపేస్తుంది. ఎక్కడున్నా ఓరుగల్లు భాష దగ్గరికి చేరుస్తుంది. అంతేకాదు.. ఓరుగల్లును, పంట భూములను భద్రకాళి, సమ్మక్క-సారలమ్మ, రుద్రేశ్వర స్వామి వార్లే కాపాడతారని ఇక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. నేడు ప్రపంచ నేల దినోత్సం. SHARE

News December 5, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా తగ్గిన సిల్వర్ రేటు!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా.. సిల్వర్ రేటు భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి రూ.1,29,930కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 ఎగబాకి రూ.1,19,100 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 తగ్గి రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.