News March 31, 2025
గ్రూప్-1లో అదరగొట్టిన పాలమూరు బిడ్డలు

ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల ర్యాంకులను టీజీపీఎస్‌సీ తాజాగా ప్రకటించింది. ఇందులో మల్టీజోనల్ ర్యాంకులలో పాలమూరు బిడ్డలు అదరగొట్టారు. కొత్తకోటకు చెందిన పవన్‌కుమార్‌కు 10వ ర్యాంకు, మూసాపేట నిజాలపూర్‌కు చెందిన వెంకటేశ్ ప్రసాద్‌కు 12వ ర్యాంకు, కల్వకుర్తి పట్టణానికి చెందిన సాహితీకి 45వ ర్యాంకు, పాన్గల్ మం. బుసిరెడ్డిపల్లికి చెందిన సుజాతకి 900 మార్కులకు గానూ.. 459 మార్కులు వచ్చాయి.
Similar News
News April 23, 2025
HYD: హైవేలపై మంచినీళ్లు ప్లీజ్..!

HYDలోని కొన్ని ప్రాంతంలో మాత్రమే జలమండలి ఫ్రీ వాటర్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. నగరంలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత, మరోవైపు ఉక్కపోతతో గొంతెండి పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రధాన రహదారుల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎండ తీవ్రతకు అనేక మంది ప్రయాణికులు తట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు.
News April 23, 2025
24 నుంచి సెలవులు.. ఆదేశాలు పాటించాలి: DEO

గుంటూరు జిల్లాలోని పాఠశాలలన్నింటికీ ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ వరకు సెలవులు ఉంటాయని, 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని చెప్పారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోనోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాటించాలని సూచించారు.
News April 23, 2025
3 లక్షల గృహాలకు ప్రారంభోత్సవాలు.. ఎప్పుడంటే?

AP: రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం వేగవంతం చేసింది. జూన్ 12కు ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో 3 లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించింది. పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అర్హులైన వారికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలం మంజూరు చేసేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు.