News March 31, 2025
గ్రూప్-1లో మంథని యువకుడికి 114వ ర్యాంకు

మంథని మండలం కాన్సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ్ కుమార్ ర్యాంకుల పరంపర కొనసాగిస్తున్నాడు. తాజాగా గ్రూప్-1లో అరుణ్ కుమార్ రాష్ట్రస్థాయిలో 114వ, మల్టీ జోన్-1 స్థాయిలో 64వ ర్యాంక్ సాధించాడు. 2018లో ట్రిపుల్ ఐటీ జబల్పూర్లో బీటెక్(సీఈసీ) పూర్తిచేశాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయిలో 35వ ర్యాంక్, గ్రూప్-3లో రాష్ట్రస్థాయిలో 81వ ర్యాంక్ సాధించాడు.
Similar News
News November 25, 2025
ధాన్యం కొనుగోలుపై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని ప.గో జాయింట్ కలెక్టర్ రాహుల్ సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, రవాణా, తూకంలో సమస్యలుంటే 81216 76653, 1800 425 1291 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేశామని, రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
News November 25, 2025
జగిత్యాల: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ పెంపుపై కలెక్టర్ సమీక్ష

2025–26 ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ల పెంపుపై కలెక్టర్ బి.సత్యప్రసాద్ మంగళవారం సమావేశం నిర్వహించారు. 5–8 ప్రభుత్వ, 9–10 ప్రభుత్వ–ప్రైవేట్ పాఠశాలల SC విద్యార్థులు tgepass.cgg.gov.inలో దరఖాస్తు చేయాలని సూచించారు. ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలు, కుల–ఆదాయం సర్టిఫికెట్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఇన్ఆపరేటివ్ ఖాతాలున్న వారికి పోస్టల్ అకౌంట్లు తెరిపించి 100% రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.
News November 25, 2025
అండర్-19 క్రికెట్ పోటీల్లో పినపాక విద్యార్థిని సత్తా

సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఎస్.జీ.ఎఫ్ అండర్-19 రాష్ట్ర స్థాయి బాలికల క్రికెట్ పోటీల్లో పినపాక మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని వైష్ణవి రత్న ప్రతిభ కనబరిచింది. కరీంనగర్‌పై 17 బంతుల్లో 32 పరుగులు, వరంగల్‌పై 40 బంతుల్లో 46 పరుగులు చేసి, 2 వికెట్లు తీసింది. మహబూబ్‌నగర్‌పై కూడా 2 వికెట్లు సాధించి జట్టు విజయానికి కీలకంగా నిలిచింది. వైష్ణవికి పలువురు అభినందనలు తెలిపారు.


