News March 31, 2025
గ్రూప్-1లో రఘునాథపల్లి యువకుడికి 332వ ర్యాంకు

గ్రూప్-1 ఫలితాల్లో రఘనాథపల్లి యువకుడు సత్తా చాటారు. కొయ్యడ ప్రభాకర్-లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఉదయ్ ఆదివారం TGPSC ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 463 మార్కులు సాధించి 332వ ర్యాంకు పొందారు. ఈయన ప్రస్తుతం సింగరేణిలో పర్సనల్ మేనేజర్గా పని చేస్తున్నారు. ఉదయ్ సోదరుడు ప్రణయ్ 2023లో IASగా ఎంపికై ప్రస్తుతం HYDలో పోస్టింగ్ తీసుకున్నారు. ఉదయ్ గ్రూప్-1 ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News April 4, 2025
నస్రుల్లాబాద్: చెరువులో మునిగి యువకుడి మృతి

కొల్లూర్ గ్రామానికి చెందిన అశోక్(19) అనే యువకుడు చేపలు పట్టేందుకు నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులోని దొంతిరెడ్డి చెరువుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని ఎస్ఐ తెలిపారు. మృతదేహం గురువారం నీటిపై తేలడంతో స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవ పంచానామా నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
News April 4, 2025
నిర్మల్: ‘తెలుగు స్క్రైబ్ రిపోర్టర్పై పోలీసులకు ఫిర్యాదు’

తప్పుడు వార్త కథనం ప్రచురించిన వ్యక్తిపై, ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మల్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలుగు స్క్రైబ్ అనే పేరుతో ‘చెరువులను కబ్జా పెడుతున్న ముఖ్యమంత్రి అనుచరుడు’ అని తన పరువుకు భంగం కలిగించే కథనాన్ని ప్రచురించాడని పేర్కొన్నారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News April 4, 2025
MBNR: ముగ్గురిపై కేసు నమోదు

మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం బిల్డింగ్తండా గ్రామంలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నిర్వహించారు. ఈ సమయంలో బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ లెనిన్తో బిల్డింగ్తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కోయిలకుంట తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.