News March 13, 2025
గ్రూప్-1లో సత్తాచాటిన పెగడపల్లి మండల వాసి

పెగడపల్లి మండలం బతికేపల్లికి చెందిన గాలిపెల్లి రాజమౌళి- అనూష కుమార్తె గాలిపెల్లి స్నేహ ఇటీవల వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో 517 మార్కులతో రాష్ట్రస్థాయి 485వ ర్యాంకు సాధించింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1కు ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంక్ సాధించడం పట్ల ఆమెను పలువురు అభినందించారు. ఆమె తండ్రి స్వర్ణకార వృత్తి చేస్తుండగా తల్లి కుట్టు మిషన్ కుడుతుంది.
Similar News
News March 14, 2025
భీమ్‌గల్: మహిళ ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకోని మహిళ మృతి చెందిన ఘటన భీమ్‌గల్ మండలం చేంగల్‌లో చోటు చేసుకుంది. SI మహేశ్ ప్రకారం.. శారద అనే మహిళ కూతురితో చేంగల్‌లో నివాసం ఉంటుంది. భర్త చనిపోవడంతో ఇంటి బాధ్యతలు తానే చుసుకుంటోంది. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఈ నెల 12న నాప్తలీన్ బాల్స్ మింగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం ఆర్మూర్ ఆస్పత్రిలో చేర్చగా ఈ నెల 13న మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
News March 14, 2025
బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన Way2News

కర్నూలు జిల్లా గోనెగండ్లలోని గంజల్ల రోడ్డు సమీపంలో 3ఏళ్ల <<15748871>>బాలుడు<<>> సంచరిస్తుండగా కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆ బాలుడిని గోనెగండ్ల పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో బాలుడి సంబంధీకులు తమన సంప్రదించాలని కోరారు. ఈ విషయాన్ని Way2News ప్రచురించింది. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాలుడిని తీసుకువెళ్లారు. తమ బిడ్డ ఆచూకీకి సహకరించిన Way2Newsకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
News March 14, 2025
బాలల హక్కులను వివరించారు: జిల్లా జడ్జి

బాలలకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా జడ్జి భవాని చంద్ర అన్నారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో జువైనల్ జస్టిస్ చట్టంపై అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాలలపై ఎవరైనా హింసకు పాల్పడితే నేరుగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని చెప్పారు. సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్, న్యాయమూర్తులు పాల్గొన్నారు.