News March 31, 2025
గ్రూప్-1లో సత్తాచాటిన సంస్థాన్ నారాయణపురం ఏఓ

సంస్థాన్ నారాయణపురం మండల వ్యవసాయ అధికారిణి కే. వర్షిత గ్రూప్-1లో సత్తాచాటారు. నాలుగు నెలల క్రితం ఏఓగా భాద్యతలు చేపట్టిన వర్షిత గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్ర స్థాయిలో 100వ ర్యాంక్, మల్టీజోన్-2లో 40 ర్యాంకు సాధించారు. ఇటీవలే ప్రకటించిన గ్రూప్-4లో 143, గ్రూప్-2లో 215వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను చాటారు. ఈ జాబ్స్ అన్నీ మొదటి ప్రయత్నంలోనే సాధించడం విశేషం.
Similar News
News November 1, 2025
హోమ్ మేడ్ క్యారెట్ సీరం

ఈ మధ్యకాలంలో ఫేస్‌గ్లో పెంచుకోవడం కోసం సీరంను ఎక్కువగా వాడుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే సీరంలు కొందరికి సరిపడవు. కాబట్టి సహజంగా ఇంట్లోనే క్యారెట్ సీరం ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 తాజాక్యారెట్‌లు తురుముకోవాలి. ఒక పాత్రలో కొబ్బరి, ఆలివ్/ బాదంనూనె వేడి చేసి క్యారెట్ తురుము వేసి 10నిమిషాలు మరిగించాలి. తర్వాత దీన్ని వడకట్టి పొడి సీసాలో భద్రపరచాలి. దీన్ని రోజూ చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
News November 1, 2025
PDPL: ‘భూభారతి దరఖాస్తులు వెంటనే డిస్పోజ్ అవ్వాలి’

భూభారతి పోర్టల్‌లో వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కాల్వశ్రీరాంపూర్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీసేవ ద్వారా పౌరసేవల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో డిస్పోజ్ చేయాలన్నారు. కార్యాలయంలోని పలు రికార్డులను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వనజ, తహశీల్దార్ జగదీశ్వర రావు, తదితరులు ఉన్నారు.
News November 1, 2025
అడ్రియాల ప్రాజెక్ట్‌లో 0.14L టన్నుల బొగ్గు ఉత్పత్తి

అక్టోబర్ నెల బొగ్గు ఉత్పత్తి వివరాలను శనివారం RG- 3 పరిధిలోని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జీఎం కొలిపాక నాగేశ్వరరావు వెల్లడించారు. లాంగ్‌వాల్ ప్రాజెక్ట్‌కు నిర్దేశించిన 1.63 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 0.14 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించేందుకు ఉద్యోగులు కట్టుబడి పనిచేయాలని జీఎం సూచించారు.


