News March 12, 2025
గ్రూప్-1లో సత్తాచాటిన ADB బిడ్డ

ఉట్నూర్ మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ వాగ్మారే జగ్జీవన్ కుమారుడు వాగ్మారే రోహిత్ గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో సత్త చాటాడు. ఇటీవల నిర్వహించిన గ్రూప్-1, 2, 3 పరీక్షలకు ఆయన హాజరవ్వగా.. సోమవారం విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో 438 మార్కులు సాధించాడు. దీంతో ఆయనను మంగళవారం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Similar News
News January 23, 2026
ADB జిల్లాలో క్షయ నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

క్షయ వ్యాధి నిర్మూలనలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, తప్పుడు సమాచారాన్ని అరికట్టి ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. టీబీ చికిత్స విజయవంతం కావడానికి ముందస్తు నిర్ధారణ, టీబీ ప్రివెంటివ్ థెరపీ, పోషకాహార మద్దతు అవసరమని తెలిపారు. టీబీ వ్యాధి జయించిన పలువురిని శాలువాతో సత్కరించారు.
News January 23, 2026
ఆదిలాబాద్: GOVT భూమి కబ్జాకు యత్నం.. 14 మందిపై కేసు

ఆదిలాబాద్ వడ్డెర కాలనీ వాటర్ ట్యాంకు వద్ద మున్సిపల్ అనుమతులు లేకుండా భూమి పూజలు చేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన 14 మందిపై, మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు 2 టౌన్ PSలో కేసు నమోదు చేశామని సీఐ కె.నాగరాజు తెలిపారు. ప్రభుత్వ అధికారులను అడ్డుకుని వాగ్వాదానికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కబ్జాదారులు ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
News January 23, 2026
ఉట్నూర్: పాలిటెక్నిక్ లేటరల్ ఎంట్రీకి దరఖాస్తు ఆహ్వానం

ఐటీఐ పూర్తి చేసి పాలిటెక్నిక్ కళాశాలలో లెటరల్ ఏంట్రీ ద్వారా నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించడానికి ప్రకటన విడుదలైనట్లు ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఐటీఐలో 60% మార్కులతో రెండేళ్ల కోర్సు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలన్నారు. తమ సమీపంలోని ఐటీఐ కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


