News June 6, 2024
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు: సీపీ

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జూన్ 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఉ.6 గంటల నుంచి సా.6 వరకు అంక్షాలు అమలులో ఉంటాయని, పరీక్షా కేంద్రానికి 500 మీటర్ల దూరం వరకు నిబంధనలు వర్తిస్తాయని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Similar News
News February 24, 2026
పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: సీఎస్

ఖమ్మం జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూ. 1.25 కోట్ల భారీ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపు సహా పలు అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపినట్లు వివరించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.