News June 6, 2024
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు: సీపీ
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జూన్ 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఉ.6 గంటల నుంచి సా.6 వరకు అంక్షాలు అమలులో ఉంటాయని, పరీక్షా కేంద్రానికి 500 మీటర్ల దూరం వరకు నిబంధనలు వర్తిస్తాయని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Similar News
News December 12, 2024
కార్పొరేషన్ విధులు పకడ్బందీగా నిర్వహించాలి: తుమ్మల
ఖమ్మం నగర పరిధిలో కార్పొరేషన్ విధులను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం కార్పొరేషన్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్‌లో విలీనమైన పంచాయతీల్లో కార్మికుల కొరత, తాగు నీటి సమస్యలు, ఫాగింగ్ యంత్రాలు, పనిముట్లు లేవని క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News December 12, 2024
గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: సీపీ
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 15 నుంచి 16 వరకు జరిగే గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని చెప్పారు. అటు పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు.
News December 12, 2024
కేయూ పరిధిలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ పరిధిలో ఈ నెల 18న జరగాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. తిరిగి పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజేందర్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల వాయిదా విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.