News April 1, 2025

గ్రూప్‌–1,2,3,4లో సత్తాచాటిన యువకుడు

image

కామేపల్లి యువకుడు గ్రూప్‌–1,2,3,4 ఫలితాల్లో సత్తాచాటాడు. గోవింద్రాల బంజరకు చెందిన గంగారపు సత్యనారయణ – జ్యోతిర్మయి దంపతుల కుమారుడు రత్నేశ్వరనాయుడు ఇటీవల విడుదలైన గ్రూప్‌-1లో రాష్ట్ర స్థాయిలో 277వ ర్యాంక్‌, జోనల్‌స్థాయిలో 120వ ర్యాంక్‌ సాధించారు. ఆయన ఖమ్మంలోని కమర్షియల్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా జాయిన్ కాలేదు.

Similar News

News November 13, 2025

దానవాయిగూడెం గురుకులంను మోడల్‌గా మారుస్తాం: పొంగులేటి

image

దానవాయిగూడెం టీ.జీ.ఎస్.డబ్ల్యు.ఆర్ బాలికల గురుకులాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పాఠశాల, కళాశాల భవన మరమ్మతులకు రూ.3.80 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. భవన మరమ్మతులు, కాంపౌండ్ వాల్, సీసీ రోడ్లు, క్రీడా మౌలిక వసతుల పనులకు మంత్రి కలెక్టర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, అధికారులు పాల్గొన్నారు.

News November 12, 2025

87% బిల్లులు డిజిటల్‌తోనే: ఖమ్మం ఎస్ఈ

image

TGNPDCL డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేవడంతో, వినియోగదారులు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 87% మంది టీజీఎన్‌పీడీసీఎల్ యాప్, గూగుల్ పే వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే బిల్లులు చెల్లిస్తున్నారని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. తద్వారా కౌంటర్లకు వెళ్లే శ్రమ లేకుండా, సురక్షితంగా బిల్లులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.

News November 12, 2025

వెలుగుమట్లలో సైనిక్ స్కూల్ అర్హతల పరిశీలన

image

ఖమ్మం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పిపిపి మోడ్‌లో దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఖమ్మంలో దరఖాస్తు చేసిన ఈ పాఠశాల అర్హతను కమిటీ పరిశీలన ఆధారంగా నిర్ణయిస్తుందని అన్నారు.