News March 12, 2025
గ్రూప్-2లో ర్యాంక్ సాధించిన మహబూబాబాద్ SI

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈ గ్రూప్-2 ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లాలో యువకులు సత్తా చాటారు. పట్టణంలో టౌన్ ఎస్ఐగా పని చేస్తున్న శివకుమార్ స్టేట్ వైడ్ 25వ ర్యాంకు సాధించి మహబూబాబాద్‌లో టాప్‌గా నిలిచారు. ఓవైపు ఎస్ఐగా పని చేస్తూ గ్రూప్-2 పరీక్షలకు చదివి టాప్ ర్యాంక్ సాధించడంతో జిల్లాలోని పలువురు ఎస్సై శివకుమార్‌ను అభినందిస్తున్నారు.
Similar News
News February 10, 2026
శ్రీశైలంలో జరగని గ్రామోత్సవం

శ్రీశైలంలో భక్తుల రద్దీతో సోమవారం నిర్వహించాల్సిన స్వామి, అమ్మవారి గ్రామోత్సవం నిలిచిపోయింది. క్యూలైన్లలో వేలాది మంది వేచి ఉండటంతో ఉత్సవమూర్తులు రాజగోపురం నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆలయ ప్రాంగణంలోనే అర్చకులు పూజలు చేశారు. అలాగే సా.7కు ద్వారకా తిరుమల ఆలయం నుంచి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలనూ సమర్పించలేదు. గ్రామోత్సవం లేకపోవడం మహా అపచారమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News February 10, 2026
ఇస్రో దూకుడు.. స్పేస్ స్టేషన్, గగన్‌యాన్, 80 శాటిలైట్లపై వర్క్..!

సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా వేగంగా ముందుకు సాగుతున్నట్లు ISRO ప్రోగ్రామ్ డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. మానవ సహిత గగన్‌యాన్ స్పేస్ మిషన్, ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్స్ వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. రీసెర్చ్, విపత్తు నిర్వహణ, భద్రత, నావిగేషన్‌తోపాటు గగన్‌యాన్ మిషన్ కోసం సంకేతాలను భూమికి పంపడంలో కీలక పాత్ర పోషించే మొత్తం 80 ఉపగ్రహాలపై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు.
News February 10, 2026
శ్రీశైలంలో భక్తకోటికై ‘పెద్దచింతరేవుల’ అన్నదానం

పెద్దచింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీశైల క్షేత్రంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక భక్తులకు ట్రస్ట్ సభ్యులు భోజన సౌకర్యం కల్పించారు. దశాబ్దాలుగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన ఈ ట్రస్ట్.. క్షేత్రానికి వచ్చే భక్తుల ఆకలి తీరుస్తూ సామాజిక బాధ్యతను చాటుకుంది.


