News March 14, 2025
గ్రూప్-2లో 11వ ర్యాంకర్‌కు కలెక్టర్ సన్మానం

తెలంగాణ గ్రూప్-2లో రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంక్ సాధించిన మోత్కూర్‌కు చెందిన గుర్రం సాయి కృష్ణారెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అభినందించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సాయి కృష్ణను సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కృషితో ఉన్నత ర్యాంక్ సాధించడం యువతకు ప్రేరణ అని ప్రశంసించారు. కార్యక్రమంలో అధికారులు వీరారెడ్డి, ఏవో జగన్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
పులివెందుల: మేమేం పాపం చేశాం.!

పులివెందుల పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో ఓ మహిళ చంటి బిడ్డను ఎత్తుకొని బిక్షాటన చేస్తున్న ఘటన కనిపించింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డతో ఏ మహిళ ఇలాంటి పని చేయదు. ఆ పసిబిడ్డ నిజంగా కన్నబిడ్డనా లేక ఆ పసిబిడ్డను కూడా డబ్బు దందాకు వాడుకుంటున్నారా అని పలువురు సందేహిస్తున్నారు. వీధి బాలలను సంరక్షించాల్సిన అధికారులకు ఇలాంటివి కనపడవా అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.
News March 21, 2025
కామారెడ్డి: 10 పరీక్షలు తొలి రోజు గైర్హాజరు ఎంతంటే..?

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ఉదయం 9:30 నుంచి 12.30 గంటల వరకు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 12,579 మంది విద్యార్థులకు 12,552 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు ఫ్లయింగ్ స్కాడ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
News March 21, 2025
బిచ్కుంద: 2024లో హత్య.. నేడు అరెస్టు

హత్య కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బిచ్కుంద సీఐ నరేశ్ తెలిపారు. శుక్రవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్‌లో హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు. బిహార్ చెందిన అంటుకుమార్ హస్గుల్‌లో మనీష్‌కు మద్యం తాగించి హత్య చేసి పరారయ్యాడు. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో 2024లో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు.