News December 15, 2024
గ్రూప్-2 ఎగ్జామ్స్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

మెహిదీపట్నం St.Ann’s గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్-2 పరీక్ష కేంద్రాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రూప్-2 పరీక్షా కేంద్రంలో చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 24, 2025
HYD: కారు ప్రమాదంలో సజీవదహనమైన దుర్గాప్రసాద్

శామీర్‌పేట్ ORRపై జరిగిన ప్రమాదంలో కారులో సజీవదహనమైన వ్యక్తి దుర్గాప్రసాద్ (34)గా పోలీసులు గుర్తించారు. హనుమకొండ ప్రాంత వాసి అని తెలిపారు. నగరంలో వ్యాపారం నిమిత్తం వచ్చి ఇంటికి వెళ్లేందుకు దుండిగల్‌లోని ORR వైపు మళ్లించాడని, శామీర్‌పేట్ ఎగ్జిట్ దాటిన తర్వాత ఉదయం 5:50 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కారులో హీటర్ ఆన్ చేసి నిద్రించాడేమోనని? అనుమానిస్తున్నారు.
News November 24, 2025
హైదరాబాద్ మెట్రో రైల్.. పర్మిషన్ ప్లీజ్

నగరంలో రోజూ లక్షలాదిమందిని మెట్రో ట్రైన్ వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఈ సేవలను మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశను ప్రతిపాదిస్తూ DPR( డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ను కేంద్రానికి పంపింది. గత సంవత్సరం నవంబర్‌లో ఒకటి, ఈ సంవత్సరం జూన్‌లో మరో ప్రతిపాదన అందజేసింది. 163 కిలోమీటర్ల వరకు మెట్రోను విస్తరిస్తామని పేర్కొంది. అయితే ఇంతవరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
News November 24, 2025
HYD: ప్రాణాలు పోతున్నాయి.. జాగ్రత్త!

వేగం మానుకో అని పోలీసులు ఎంత చెబుతున్నా కొందరు రైడర్లు ఆ మాటను పెడచెవిన పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌తో ఇటీవల HYDలో పదుల సంఖ్యలో చనిపోయారు. సెల్ఫ్ డ్రైవింగ్‌లో చేసిన తప్పిదాలు, డివైడర్లు, <<18366739>>మెట్రో పిల్లర్ల గోడలను<<>> ఢీ కొట్టిన ఘటనలూ ఉన్నాయి. అల్వాల్‌లో ఇవాళ ఉ. ఓ కారు దుకాణాల మీదకు దూసుకురాగా.. సదరు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సో.. హైదరాబాదీ ఇకనైనా స్వీడ్ తగ్గించు.


