News March 15, 2025

గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లో సత్తాచాటిన బీర్పూర్ యువకుడు

image

బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన చీరనేని రాజశేఖర్ ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 287 ర్యాంకు, గ్రూప్-3 ఫలితాల్లో 86 రాంక్ సాధించారు. ప్రస్తుతం ఆర్మూర్ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గతంలో రైల్వేలో ఉద్యోగం, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో బీట్ ఆఫీసర్ కూడా విధులు నిర్వర్తించారు. దీంతో తల్లిదండ్రులు చంద్రయ్య, రాజవ్వ, గ్రామస్థులు రాజశేఖర్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News April 12, 2026

రాజమండ్రి రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్‌పై డెడ్ బాడీ..!

image

రాజమండ్రి రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై శనివారం సుమారు 64 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. మృతుడు గోధుమ రంగు టీషర్ట్, డార్క్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ‘మావూరి అప్పారావు, తండ్రి వీరన్న’ అని ఉన్న ఆసుపత్రి చీటి లభించింది. ఆచూకీ తెలిసిన వారు 9440779249 నంబరును సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ వై.వి. రమణ కోరారు.

News April 12, 2026

కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి

image

సూర్యుడి ప్రతాపానికి KNL, NDL జిల్లాలు నిప్పుల కొలిమిలా మారాయి. శనివారం నంద్యాల(D) గోస్పాడులో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆళ్లగడ్డ 42.6, దొర్నిపాడు 42.3, రుద్రవరం 42.2, నంద్యాల రూరల్ 42.1, చాగలమర్రి, పాణ్యం 42, ఉయ్యాలవాడ 41.9, బనగానపల్లె 41.8, జూపాడుబంగ్లా, పగిడ్యాల 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. కర్నూలు(D) మంత్రాలయంలో 42.7, కౌతాళం 42.2, కోడుమూరు 41.6, ఆలూరు, కల్లూరు 41.5 డిగ్రీలు నమోదయ్యాయి.

News April 12, 2026

గోదావరి దాటి పోలవరం అడవుల్లోకి పెద్దపులి

image

పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంటూరు వద్ద పెద్దపులి గోదావరి దాటి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా వాడపల్లి, కొత్తూరు పరిసర కొండల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారి ఎస్కే వలీ ధ్రువీకరించారు. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు ఒంటరిగా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పులికి హాని తలపెట్టకుండా సమాచారం అందించాలని అధికారులు కోరారు.